కాఫీవిత్‌.‌..‌ఆర్.రమాదేవి..1601-ఎ.రజాహుస్సేన్

సముద్రంలో ఒక్క“అల” చాలు.ఆ సముద్రం తీరుకనుక్కోవటానికి.భావ సంద్రంలో ఒక్కకవిత చాలు.
ఆ కవి/ కవయిత్రి ప్రతిభ తెలియటానికి..‌ఈ కవయిత్రి రమాదేవి కవిత్వాన్ని కొన్నిసంవత్సరాలుగా గమ
నిస్తున్నాను..ప్రేమ కవిత్వం మాత్రమేరాస్తున్నా,ఎక్కడ చర్విత చరణం లేకుండా ఫ్రెష్ గా రాయడం 
ఈమెకే చెల్లింది.ఒకే వస్తువు(ప్రేమ) అయినా..పట్టుతప్పకుండా రాయడం చిన్నవిషయం కాదు.
ఈరోజుకాఫీటైమ్లో రమాదేవి మరో ప్రేమ కవితను చూద్దాం..!!

“ఒకానొక
తెలియని రంగేదో
నన్ను తాకి తప్పిపోతూ ఉంటుంది
అది
నువ్వేనటోయ్…”
ఆర్.రమాదేవి‌.!!

ఈ కవయిత్రి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఫేస్బుక్ పాఠకులకు రమాదేవి
కవిత్వం గురించి బాగా తెలుసు..ఓ అవ్యక్తానుభూతికి (అమూర్తం) రంగు,రుచి,వాసన కల్పించడం
 సామాన్య మైన విషయం కాదు.‌ఈ కవిత.. చాలా చిన్నది.ఇంత చిన్న కవితలో సైతం మెరుపు
లాంటి ఓ అందమైన భావాన్ని ఒంపడం రమాదేవికే చెల్లింది.

ఒకానొక తెలియని  రంగేదో ఆమెను తాకి తప్పిపోతూ ఉంది..ఇంతకూ ఆ రంగెవరు? ఇంకెవరూ
అతగాడే(ప్రియుడు) సుమా! ఆమెకు తెలియకుండానే అతగాడు తాకి వెళిపోతున్నాడు..
ఒక సారి కాదు.రెండు సార్లు కాదు. నిత్యం ఇలానే జరుగుతోంది..ఇదో పనైపోయింది
అతగాడికి..‌అలా తనను తాకి వెళుతున్నది ఎవరో ఆమెకు స్పష్టంగా తెలీదు..ఆలోచిస్తే చివరకు ఆమెకు
అతగాడిమీదే అనుమానం వచ్చింది..”రోజూ తెలీకుండా నన్ను తాకి వెళుతున్నది నువ్వేకదూ.”
అంటూ అతగాడి గుట్టు విప్పింది.అతగాడు‌ (ప్రియుడు/ ప్రియభావన)  వైఫై లా ఎప్పుడూ ప్రియురాలి చుట్టే తిరుగుతుంటుంది..గాలివీస్తే, ఆ గాలి తాకిడిలో అతడుంటాడు.. భౌతికంగా ఆమె చెంత లేక పోవొచ్చు గానీ
మానసికంగా అతగాడు ఎప్పుడూ ఆమె చుట్టే తిరుగుతుంటాడన్నది ఈ కవిత ….సారాంశం…

దూరంగా వున్నా..ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది..ప్రేమకున్న బలం అదే.!!
ఈ కవిత చదివితే ఓ ప్రేమ దృశ్యం మన కళ్ళముందు కనిపిస్తుంది…భావం బలంగా వుండి,
వ్యక్తీకరణ బాగుంటే కవితకు సైజుతో పనిలేదు.‌!!
*ఎ.రజాహుస్సేన్..!!


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!